ఎంతకాలమయింది తెలుగు లో రాసి, గుర్తు లేదు, ఒకప్పుడు తెలుగు నాకు ఇష్టం, ఇప్పుడు మాట్లాడటమే కష్టం, ఇంగ్లీష్ కాలేజీ లో, ఫ్రెండ్స్ తో హిందీ, ఎప్పుడు ఫోన్ లో అమ్మ తో తెలుగు, ఇంట్లో ఉన్న కాసేపు తెలుగు, అంతే, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను తెలుగు బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అని, ఇప్పటి కి కుదిరింది. కొంచం కష్టం గా ఉంది, అలవాటు తప్పింది. మా తెలుగు మాస్టారు ఆర్కుట్ లో ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నారు, చిన్నప్పుడు అయన నాకు ఆదర్శం, ఇప్పడు ఆ వర్డ్ కి అర్ధం telusu కాని sixth క్లాసు లో ఆయన అంటే ఒక ishtam, gauravam, నన్ను మెచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషం, school lo తెలుగు లో ఫస్ట్, ఇంటర్ లో తెలుగు లో ఫస్ట్, డిగ్రీ లో ఉనివెర్సితి ఫస్ట్, అంతే, అక్కడి తో తెలుగు తో పని అయిపొయింది. జీవిత రణరంగం లో పరిగెత్తే ప్రయత్నం లో చిన్ని చిన్ని సంతోషాలు మర్చిపోయాను, అందులో తెలుగు ఒకటి, తెలుగు పుస్తకాలు, తెలుగు సంగీతం, అచ్చమయిన తెలుగు తనం, అన్ని వెనకాల ఎక్కడో వదిలేసాను. అంతేనేమో జీవితం అంటే.
నాకు ఇష్టం అయిన బ్లాగ్ లో ఒకటి సింప్ల్య్ శ్రీ బ్లాగ్, తను ఒక ఫోటో బ్లాగ్ కూడా రాస్తుంది, అందులో తను నాకూ తెలిసిన ఒక పల్లెటూరి అందాలని ఆనందాలని గురించి రాసినప్పుడల్లా కళ్ళల్లో నీరు, గుండెల్లో గుబులు, నేను పల్లెటూరు వెళ్లి పది సంవత్సరాలు, ఎప్పటికయినా వెళ్తాను అనే ఆశ తక్కువే. ఏమో.
సంతోషం గా ఉంది, మల్లి రాయాలని ఉంది, రాస్తానో లేదో తెలీదు, కాని తప్పకుండా ట్రై చేస్తాను.